ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 6:14 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

దుర్గా నవరాత్రి ఉత్సవాలు, దసరా ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.

దుర్గా నవరాత్రి ఉత్సవాలు, దసరా ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.

పెగడపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

పెగడపల్లి (ధర్మపురి) : అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 17,
 

జగిత్యాల జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించే క్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం పెగడపల్లిలోని పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, బీట్ వ్యవస్థ అమలు, రౌడీషీటర్లు, నేరస్తులపై నిఘా అంశాలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందిస్తున్న సేవలపై ఎస్పీ ప్రత్యేకంగా ఆరా తీశారు.
ప్రస్తుతం జరుగుతున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. మండపాల వద్ద భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని, మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. నేరాల నియంత్రణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు. పాత నేరస్తుల కదలికలను గమనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలని సూచించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఎస్పి వెంట ఎస్.ఐ కుమార స్వామి ఉన్నారు.